- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మునుగోడు బీజేపీ లీడర్‌కు KTR ఫోన్ (వీడియో)

X
దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తోన్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నాయకుల్ని టీఆర్ఎస్‌లోకి తీసుకురావడానికి స్వయంగా మంత్రి కేటీఆరే రంగంలోకి దిగారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన గట్టుప్పల్ మండల మాజీ సర్పంచ్ నామం జగన్నాథానికి కేటీఆర్ ఫోన్ చేశారు. టీఆర్ఎస్‌లో చేరాలని, అన్ని రకాల తోడ్పాటు అందిస్తామని ఫోన్ ద్వారా కోరారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పార్టీ మీద ప్రేమతో పోలేదని సొంత ప్రయోజనాల కోసం వెళ్లారని కేటీఆర్ తెలియజేశారు. ఈ ఫోన్ కాల్‌ను రికార్డు చేసిన బీజేపీ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది. అయితే, గట్టుప్పల్ మాజీ సర్పంచ్ జగన్నాథం గతంలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
Next Story