- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Koppula Eshwar: 'దళితులకు న్యాయం చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్'
దిశ, తెలంగాణ బ్యూరో: ఉచితాలు ఎత్తివేస్తే పేదలకు అన్యాయం జరుగుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓన్లీ పెద్దల సంక్షేమంపైనే దృష్టి సారిస్తుందన్నారు. వారిని మరింత సంపన్నులను చేస్తుందన్నారు. ఆదివారం టీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్సీ ఎల్.రమణ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కోరుకంటి చందర్లతో కలసి ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. దళితులకు న్యాయం చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. దళితబంధుతో ఇప్పటికే మొదటి విడతగా 32 వేల కుటుంబాలకు లబ్ది చేకూరిందన్నారు. రూ.3,249 కోట్లరూపాయలకు పైగా ఇప్పటి వరకు దళితబంధు కోసం వెచ్చించామన్నారు. దళితులను యజమానులను చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. దళితులపై ప్రేమ ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధును అమలు చేయాలన్నారు.
దేశ వ్యాప్తంగా దళితబంధు పథకం రావాలని అనేక రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దళితబందు మంచి పథకమని, దానిపై దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీ కుట్రతోనే ఉచితాలు రద్దు అనే ప్రస్తావన తెస్తోందన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తన మేనిఫెస్టోలో దళితబందు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగి పోయాయన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో సామాజిక బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులను దేవాలయాలకు రాకుండా నిరోధిస్తున్నట్లు ఆరోపించారు. ముఖ్యంగా యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. 8 ఏళ్ల బీజేపీలో పేదలు మరింత పెదవాళ్లుగా, ధనికులు మరింత ధనవంతులుగా అవుతున్నారన్నారు.
అన్ని జిల్లాల్లో...
త్వరలోనే అన్ని జిల్లాలో దళితబంధుపై సమీక్షలు జరుపుతామన్నారు. అర్హులైన వారందరికీ ఈ స్కీమ్‌ను అందజేస్తామన్నారు. సెప్టెంబరు 17కు ఓ చరిత్ర ఉన్నదని, అందుకే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తెలంగాణ విలీన దినోత్సవాన్ని వాడుకోవాలని చూస్తుందన్నారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవాలు జరుపుకుంటామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే, బీజేపీ మాత్రం ఒక్కో వర్గానికి అన్యాయం చేసుకుంటూ వస్తోందన్నారు. నిర్మలా సీతారామన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం నడుస్తదా? అని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి మోడీ ఫోటో పెట్టలేదని అడగటం శోచనియమన్నారు. కేసీఆర్ పథకాలను అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రం కాపీ కొడుతోందన్నారు.