నేను కేటీఆర్‌కు క్షమాపణ చెప్పలేదు.. కొండా సురేఖ క్లారిటీ

by GSrikanth |
నేను కేటీఆర్‌కు క్షమాపణ చెప్పలేదు.. కొండా సురేఖ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్ లీగల్ నోటీసులపై తాను స్పందించబోనని మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను కేటీఆర్‌పై ఆరోపణలు మాత్రమే చేశానని.. ఎలాంటి క్షమాపణలు చెప్పలేదని తెలిపారు. కేటీఆరే తాట తీస్తా అని మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. నోటీసులపై నేను లీగల్‌గా వెళ్తానని ప్రకటించారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేటీఆర్ పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మంత్రి కొండా సురేఖకు, మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story