- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి బీఆర్ఎస్ నాయకులు.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ అధిష్టానం ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ నిరసనలపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ కేసుకు, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. కవితను అరెస్ట్ చేసింది ఢిల్లీ పోలీసులైతే.. తెలంగాణలో ధర్నాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని మండిపడ్డారు. నాడు చంద్రబాబు అరెస్టు సందర్భంగా జరిగిన ధర్నాలను, ర్యాలీలను అడ్డుకున్న వ్యక్తులే ఇవాళ ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విషయాలకు హైదరాబాద్‌లో ధర్నలెందుకని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు.. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు అరెస్టు చేస్తే తెలంగాణలో ధర్నాలకు ఎందుకు పిలుపునిస్తున్నారని అడిగారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను ఢిల్లీకి తీసుకపోయి ఈడీ ఆఫీసు ముందు ధర్నాలు దీక్షలు చేసుకోండి అని హితవు పలికారు. ‘ఎవడొస్తడో రా చూసుకుందాం అని తొడకొట్టి.. ఇప్పుడు అమాయక కార్యకర్తలను రోడ్లమీదకి తేవడం ఎందుకు’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పాలనతో ప్రజల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగులు నిండుతున్నాయని.. మళ్లీ మీ కుటిల రాజకీయాలతో తెలంగాణ ప్రజల్ని ఇబ్బందులు పెట్టకండని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రితో కుమ్మక్కై రాయలసీమకు నీళ్లివ్వడం మూలంగా ఇవాళ తెలంగాణ ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయాయని తెలిపారు. రైతులు కరువుతో అల్లాడితోపోతుంటే.. మీ లిక్కర్ రాజకీయాలకు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాలనుకుంటున్నారా..? అని ఘాటుగా కోమటిరెడ్డి స్పందించారు.