Minister Komatireddy: పైసా పైసా కూడబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం

by Gantepaka Srikanth |
Minister Komatireddy: పైసా పైసా కూడబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) చేసిన నిర్వాకం వల్ల పైసా పైసా కూడబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అన్నారు. ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)తో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్(KCR) ఫామ్‌హౌజ్‌లో పడుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభివృద్ధి పథంలో నడుపుతున్నారని అన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు.

రాష్ట్రంలో అతి త్వరలో కొత్త విద్యుత్ పాలసీ(New Power Policy)ని తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిబంధనలను అనుసరించి గ్రీన్ ఎనర్జీని అందించేందుకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, పవన విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2034-38 నాటికి 35,800 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అవసరం ఉంటుందని అన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు 20000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ పాలసీ కోసం విద్యుత్ రంగంలో అపార అనుభవం ఉన్న నిష్ణాతులను, అనుభవజ్ఞుల సలహాలతో ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed