మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం.. కోమటిరెడ్డి సంచలన స్టేట్‌మెంట్

by Gantepaka Srikanth |
మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం.. కోమటిరెడ్డి సంచలన స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ రంగంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇద్దరు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండలో జగదీశ్ రెడ్డికి క్రిమినల్ రికార్డు ఉందని ఆరోపించారు. మర్డర్ కేసులో జగదీశ్ రెడ్డి 16 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగారని అన్నారు. దీనికి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. మూడు కేసుల్లో కోర్టు తనను నిర్దోషిగా తేల్చిందని తెలిపారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను తక్షణమే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను జగదీశ్ రెడ్డి కోరారు.

కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని జగదీశ్ రెడ్డి ప్రకటించారు. దీనికి కోమటిరెడ్డి స్పందిస్తూ.. జగదీశ్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. నిరూపించలేకపోతే తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని సంచలన ప్రకటన చేశారు. అసలు జగదీశ్ రెడ్డి గురించి మాట్లాడితే తమ గౌరవం పోతుందని అన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిపైనా జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ నేత కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే అని.. మీలాగా సంచులు మోసిన చంద్రుడు కాదని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed