జీహెచ్‌ఎంసీలో నలుగురు మేయర్లు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |
జీహెచ్‌ఎంసీలో నలుగురు మేయర్లు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America) తర్వాత అధిక బహుళజాతి కంపెనీలు హైదరాబాద్‌(Hyderabad)లోనే ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో అసోచామ్ ఆధ్వర్యంలో అర్బన్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ సదస్సు(Conference on Urban Infrastructure) నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నిరెన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని అన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూసీ కంటే ప్రమాదకరమైన సబర్మతిని మంచినీటి సరస్సుగా మార్చారని గుర్తుచేశారు.

అంతేకాదు.. రీజనల్ రింగ్ రోడ్‌(Regional Ring Road)తో హైదరాబాద్‌ రుపురేఖలే మారబోతున్నాయని అన్నారు. దాదాపు 30వేల కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సాయం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో రీజినల్ రింగు రోడ్డుకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిందని, దీనివల్ల రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లావాసులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే మూసీ నది ఆక్రమణలపై మార్కింగ్ చేశారని, తాము మరింత ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం రాద్దాంతం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీలో జనాభా భారీగా పెరిగిపోయిందని.. అందుకే మహానగరాన్ని విభజించి.. నాలుగు మేయర్ స్థానాలు ఏర్పాటు చేయాలనే అంశం పరిశీలనలో ఉందని కీలక ప్రకటన చేశారు.

Next Story