30 నెలల్లో పూర్తి చేసి చూపిస్తా.. మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
30 నెలల్లో పూర్తి చేసి చూపిస్తా.. మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు బీఆర్ఎస్ స్వార్థపూరిత రాజకీయాలు చేసిందని అన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆస్తులు రెట్టింపు అయ్యాయని తెలిపారు. కేవలం కుట్రపూరితంగా వ్యవహరించి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. వచ్చే 30 నెలల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి చూపిస్తామని కీలక ప్రకటన చేశారు. ఇదొక్కటే కాదని.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని అన్నారు. డీ37 కెనాల్ ద్వారా 50 వేల ఎకరాలకు నీరందిస్తామని అన్నారు. అంతకుముందు అధికారులకు మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే నేలమట్టం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. తాను అమెరికా వెళ్లి వచ్చే లోగా అంటే ఆగస్టు 11వ తేదీలోగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed