- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనియా గాంధీ పదవిని వదులుకొని పీవీని ప్రధానిగా చేశారు: మంత్రి కోమటిరెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహా రావుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రత్న ప్రకటించడంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మచ్చలేని నాయకుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు. రాజకీయాల్లో ఆయన మార్గదర్శకుడు అని అభిప్రాయపడ్డారు. పీవీ నరసింహా రావును ప్రధాని మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు. దేశానికి ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వస్తే వదులుకొని.. పీవీ నరసింహారావుకు సోనియా గాంధీ ఛాన్స్ ఇచ్చారని తెలిపారు. జనతా పార్టీ దేశాన్ని ముక్కలు చేసిందని గుర్తుచేశారు. పీవీ సంస్కరణలు అమలు చేసి దేశాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించారని అన్నారు.
కాగా, పీవీ నరసింహా రావు పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు. ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ఈ పదవిని అధిష్టించిన మొదటి దక్షిణ భారత దేశానికి చెందిన వ్యక్తి.. ఒకే ఒక్క తెలుగువాడు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అదే సమయంలో దేశభద్రతకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలకు కూడా ఆయన సాక్షిగా ఉన్నాడు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పీవీ రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేశారు.