Jupally Krishna Rao: లండన్‌లో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు రోడ్ షో

by Gantepaka Srikanth |
Jupally Krishna Rao: లండన్‌లో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు రోడ్ షో
X

దిశ, వెబ్‌డెస్క్: ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) సోమ‌వారం ఉద‌యం లండ‌న్ ప‌ర్యట‌న‌కు వెళ్లనున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ టూరిజా(Telangana Tourism)న్ని ప్రమోట్ చేయ‌డం, ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించ‌డం, ప‌ర్యాట‌క రంగంలో పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా మంత్రి జూప‌ల్లి ఇంగ్లాండ్(England) ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా లండన్‌లో జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) లో మంత్రి జూప‌ల్లి పాల్గొంటారు. అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా ఈ వరల్డ్ ట్రావెల్ మార్కెట్(WTM)లో తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ స్టాల్‌ను ఏర్పాటు చేయ‌నుంది. ఆయా దేశాల ప‌ర్యాట‌క శాఖ మంత్రులు, విదేశీ ప్ర‌తినిధులు, గ్లోబల్ టూరిజం బోర్డులు, హోటళ్ల యజమానులు, ప్ర‌యాణ‌, ఆతిధ్య‌ రంగ నిపుణల‌తో మంత్రి జూప‌ల్లి భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప‌ర్యాట‌క, ఆతిధ్య‌ రంగంలోపెట్టుబ‌డుల అనుకూల‌త‌ల గురించి చ‌ర్చించ‌నున్నారు.

లండ‌న్‌లోని కాసిల్ గ్రీన్‌లో నిర్వ‌హించే తెలంగాణ ప‌ర్యాట‌క రోడ్ షో లోనూ మంత్రి జూప‌ల్లి పాల్గొంటారు. లండ‌న్ వేదిక న‌వంబ‌ర్ 5 నుంచి 7 వ‌ర‌కు మూడు రోజుల పాటు వ‌ర‌ల్డ్ ట్రావెల్ మార్ట్ జ‌ర‌గ‌నుంది. ఈ ట్రావెట్ మార్ట్‌లో 100కుపైగా విదేశీ ప్ర‌తినిధులు, కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్‌తో పాటు ఆయా రాష్ట్రాల ప‌ర్యాట‌క శాఖ మంత్రులు, అధికారులు ఈ మార్ట్‌లో పాల్గొన‌నున్నారు.

Advertisement

Next Story