Minister Jupallay: ఎమ్మెల్యే బండ్ల పార్టీ మార్పులో బిగ్ ట్విస్ట్.. మంత్రి జూపల్లి కీలక ప్రకటన

by Shiva |   ( Updated:2024-08-01 05:48:22.0  )
Minister Jupallay: ఎమ్మెల్యే బండ్ల పార్టీ మార్పులో బిగ్ ట్విస్ట్.. మంత్రి జూపల్లి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి పార్టీ మార్పులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మ‌ళ్లీ సొంత‌ గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్న బండ్లను బుజ్జగించేందుకు మంత్రి జూపల్లి ఇవాళ ఉదయం ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణమోహన్ రెడ్డిని పార్టీ మారొద్దని బుజ్జగించారు. అనంతరం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని తెలిపారు. పాత సంబంధాలతోనే ఇటీవల బీఆర్ఎస్ నేతలను కలిశారని పేర్కొన్నారు. బండ్ల పార్టీ మార్పు వార్తలు అన్ని ఊహగానాలే అని కొట్టి పడేశారు. తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని.. అందరం కలిసే ఉన్నామని తెలిపారు.

Advertisement

Next Story