- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇక నుంచి సర్ఫ్రైజ్ విజిట్లు.. మంత్రి హరీశ్ కీలక ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాసుపత్రుల్లో ఇక నుంచి సర్ఫ్రైజ్ విజిట్లు ఉంటాయని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. డీహెచ్డా జీ శ్రీనివాసరావు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణలు ప్రతీ నెల ఒక జిల్లా చొప్పున అకస్మిక తనీఖీలు చేస్తారని ప్రకటించారు. ఆదివారం డీఎమ్హెచ్ఓలు, డిప్యూటీ డీఎమ్హెచ్ఓలు, పీహెచ్ సీ వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశాలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం, పనితీరు లేకపోవడం వంటి వాటిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అదే విధంగా అద్భుతమైన పనితీరు కలిగిన స్టాఫ్కు నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతీ విభాగంలో ముగ్గురిని ఎంపిక చేసి ఇస్తామన్నారు. ఈ నెల7వ వరల్డ్ హెల్త్ డే వీటిని అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతీ మూడు నెలలకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందుకోసం పోటీతత్వంతో పని చేయాల్సినఅవసరం ఉన్నదన్నారు. గతేడాదితో పోల్చితే ఈ సారి సీఎం కేసీఆర్ ఆరోగ్యశాఖ బడ్జెట్ ను రెట్టింపు చేస్తూరూ. 11,237 కోట్లను కేటాయించినట్లు గుర్తు చేశారు. ఈ నిధులు వినియోగిస్తూ సత్ఫలితాలను తీసుకురావాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నూతనోత్సాహంతో పని చేయాలని చెప్పారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, స్టేట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ సుధీర, ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమాల అధికారులు పాల్గొన్నారు.