ఆ కమిటీ వేసుకోండి.. బీజేపీకి మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్

by Satheesh |   ( Updated:2023-10-07 06:46:39.0  )
ఆ కమిటీ వేసుకోండి.. బీజేపీకి మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ వస్తుందని బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో హంగ్ రాదని.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. నడ్డా ఇది కేసీఆర్ అడ్డా అని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రయోగాత్మకంగా తీసుకువచ్చిన చేరికల కమిటీ అట్టర్ ప్లాఫ్ అయ్యిందని ఎద్దేవా చేశారు. డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకోవాలని.. పరువు అయిన దక్కుతుందని సెటైర్ వేశారు. కాగా, తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ నేత బీఎల్ సంతోష్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed