కంపెనీలు అమ్మడం తప్ప BJP చేసిందేమి లేదు: కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఫైర్

by Satheesh |   ( Updated:2023-03-05 13:33:34.0  )
కంపెనీలు అమ్మడం తప్ప BJP చేసిందేమి లేదు: కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళి సైకి ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేయలేదన్న ఆమె వ్యాఖ్యలకు.. గతంలో ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు నూతన మెడికల్ కాలేజీలు కేటాయించాలని కేంద్రాన్ని కోరిన వీడియోను రీట్వీట్ చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు.

రూ. 400 ఉన్న సిలిండర్ ధరను రూ. 1200 చేశారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై హరీష్ రావు ధ్వజమెత్తారు. నిత్యవసరాల ధరలు భారీగా పెంచి పేదల ఉసురుపోసుకుంటున్నారని విమర్శించారు. కులం, మతం పేరుతో బీజేపీ ఓట్లు దండుకుంటోందని అన్నారు. డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం తప్ప బీజేపీ ప్రభుత్వం ఏమి చేయలేదని ఫైరయ్యారు. ఉద్యోగాలు ఊడగొట్టడం, కంపెనీలు అమ్మడం తప్ప.. దేశంలో బీజేపీ సర్కార్ చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు.

Also Read...

సంగారెడ్డి మున్సిపాలిటీలో అవినీతిపై విచారణ చేపట్టాలి : బీజేపీ నాయకులు డిమాండ్

Advertisement

Next Story

Most Viewed