- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం కుట్రలను తిప్పికొడతాం.. మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం కుట్రలను తిప్పికొడతామని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే శక్తి కేసీఆర్ కు మాత్రమే ఉందనే విషయాన్ని దేశప్రజలు గుర్తించారని తెలిపారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో సూర్యాపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కొండపల్లి భద్రమ్మతో పాటు ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్నదన్నారు. అభివృద్ధి, ఎజెండా లు ఏమి లేకుండా బూత్ మాటలకే గల్లీ నాయకులు పరిమితం కావడంతో ఆ పార్టీ క్యాడర్ బీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లిందని విమర్శించారు. మోదీ సర్కార్ ప్రభుత్వ రంగసంస్థలను తమ తాబేదారులకు కట్టబడుతుందని ఆరోపించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటికరించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసిందని మండిపడ్డారు. ప్రైవేటు సంస్థల డిమాండ్ మేరకే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలంటూ కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తుందన్నారు. పెరిగిన డిమాండ్ కనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం, ఎన్టీపీసీ నిర్లక్ష్యానికి తోడు రెండు ప్లాంట్లు నిలిచి పోవడంతో విద్యుత్ సరఫరాలో అవరోధం ఏర్పడిందన్నారు.
వ్యవసాయంతో పాటు వాణిజ్య, వ్యాపార గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకం ఉండబోదన్నారు. పెరుగుతున్న డిమాండ్ కనుగుణంగా విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు అవసరమైన ట్రాన్స్ మిషన్ లైన్స్,ట్రాన్స్ఫార్మర్స్,డిస్ట్రిబ్యూటరీ లైన్స్,ట్రాన్స్ఫార్మర్స్ సిద్ధం చేశామన్నారు. తెలంగాణలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టె ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.
పార్టీ లో చేరిన వారిలో ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్ రెడ్డి, యువజన విభాగం జాతీయ ఉపాధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు రాజేందర్ రెడ్డి,అమరనాధ్ రెడ్డి, మైనారిటీ నేతలు ఎంఏ రషీద్, అబ్దుల్ రహీం, ఎస్ కే జమాల్, బాబా తదితరులుఉన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్లు జహీర్ , మడి పల్లి విక్రమ్, నేతలు బైరు వెంకన్నగౌడ్, గుడిపూడి వెంకటేశ్వర రావు, సయ్యద్ సలీమ్, మీలా వంశీ, శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.