సర్వాయి పాపన్న ఆశయ సాధకుడు కేసీఆర్.. మంత్రి గంగుల కమలాకర్

by Javid Pasha |
సర్వాయి పాపన్న ఆశయ సాధకుడు కేసీఆర్.. మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్ టౌన్: సర్వాయి పాపన్న ఆశయసాధకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనని , గోల్కోండ కోటపై జెండా ఎగరెసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేడు కరీంనగర్ లో సర్వాయి పాపన్న 313 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. పాపన్నగౌడ్ పోరాట పటిమను, ఆయన పౌరుషాన్ని ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకుని రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.

300 సంవత్సరాల ముందే బహుజన రాజ్యం కోసం గోల్కోండ కోటను, సింహాసనాన్ని జయించిన బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గంగుల గుర్తు చేశారు. పాపన్న గౌడ్ గౌడ కులానికే కాకుండా బీసీ సామాజిక వర్గానికి, అన్ని కులాలకు సహకరించిన ధీరుడని, పెత్తందారులను ఎదురించి, పేదలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, జడ్పీ చైర్మన్ విజయ, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణ రావు, గ్రంథాలయ చైర్మన్ అనిల్ గౌడ్, భారాసా నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ , మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం నాయకులు (కలర్ సతన్న), సింగం సతయ్య, కట్ట సత్తయ్య, తరుణ్ ,కార్పొరేటర్ లు కోటగిరి భూమగౌడ్, గుగ్గిళ్ళ జయశ్రీ -శ్రీనివాస్ ఐలందర్ యాదవ్, ముత్యం శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed