మళ్లీ మొదలైన బియ్యం గొడవ.. కేంద్రంపై మంత్రి గంగుల ఫైర్

by Javid Pasha |
Minister Gangula Kamalakar Tests Positive for Corona
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ మధ్య బియ్యం గొడవ మళ్లీ మొదలైంది. బియ్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వరి రైతులపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర కోటి పది లక్షల టన్నుల వరి ధాన్యం నిల్వ ఉందని మంత్రి తెలిపారు. ఎగుమతులపై కేంద్రం నిషేధం విధిస్తే రైతులు ఇబ్బందిపడుతారని తెలిపారు. అటు కేంద్రం కొనక.. ఇటు ఎగుమతులకు అనుమతి ఇవ్వక రైతులు తమ ధాన్యాన్ని ఎలా అమ్ముకోవాలని ప్రశ్నించారు.

గతేడాది కేంద్ర ప్రభుత్వం ఒక్క వరి గింజను కొనకున్నా కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఇబ్బందిపెట్టవద్దనే ఉద్దేశంతో పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేసిందని చెప్పారు. ఇప్పుడు ఎగుమతులు ఆపివేస్తే రైతులకు కష్టాలు తప్పవని, ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ముందే హెచ్చరించారని మంత్రి గంగుల పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed