- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కామెంట్స్‌పై మంత్రి ఎర్రబెల్లి వివరణ
దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్న కామెంట్స్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రియాక్ట్ అయ్యారు. తాను ఎక్కడా అలా అనలేదని చెప్పారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పారు. 15 నుంచి 20 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల నుంచి బీఆర్ఎస్ కు తీవ్రమైన పోటీ ఉంటుందని అందువల్లే ఆ 20 స్థానాల్లో మరింత కష్టపడాల్సి ఉంటుందని మాత్రమే తాను చెప్పానన్నారు. మీడియా తన మాటలను వక్రీకరించిందని, పూర్తి వీడియో కాకుండా సగం సగం కట్ చేసి చూపించి అర్థమే మార్చేశారని అన్నారు.
కాగా నిన్న ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఎర్రబెల్లి క్షేత్రస్థాయిలో కేసీఆర్ పట్ల సానుకూలత ఉందన్నారు. కేసీఆర్ కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కొంత మంది ఎమ్మెల్యేలపై మాత్రం ప్రజల్లో కోపం ఉందని అలాంటి 20 మంది ఎమ్మెల్యేలను మారిస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వందకు వంద స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎర్రబెల్లి వ్యాఖ్యతో ప్రజల వ్యతిరేకత ఉన్న ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరూ అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై బుధవారం స్పందించిన మంత్రి నా మాటలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు.