రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులపై మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక నిర్ణయం

by Ramesh N |
రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులపై మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన పనితీరును కలిగిన 14 బ్లడ్ బ్యాంకులను Components Upgrade కంపోనెంట్స్ ఆప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు. గురువారం మంత్రి దామోదర్ రాజనర్సింహ సచివాలయం లోని తన కార్యాలయంలో రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకుల పనితీరు, నిర్వహణపై, బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన పనితీరును కలిగిన 14 బ్లడ్ బ్యాంకులను కంపోనెంట్స్ ఆప్‌గ్రేడ్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బ్లడ్ బ్యాంకుల (63) పనితీరు, నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జూన్ 14న జరిగే ప్రపంచ రక్త దాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన ఆవశ్యకతపై అవగాహన సదస్సులను నిర్వహించాలని మంత్రి అధికారులను కోరారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్త నిల్వలను పెంచుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ హైమావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story