- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ లీడర్లలో కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఎల్బీ స్టేడియానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రోడ్డుమార్గం కిక్కిరిపోవడంతో పలువురు నాయకులు, కార్యకర్తలు మెట్రోరైళ్లలో ఎల్బీ స్టేడియానికి చేరకుంటున్నారు. దీంతో ఎల్బీనగర్- అసెంబ్లీ, మియాపూర్- అసెంబ్లీ రూట్లలో మెట్రో బోగీలు ఫుల్ అయ్యాయి. కొంతమంది ట్రైన్లో స్పెస్ లేక ప్లాట్ ఫాంలపైనే నిలబడి ట్రైన్ల కోసం ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తయినా మెట్రోకు కాంగ్రెస్ శ్రేణుల తాకిడి తగ్గడం లేదు. వివిధ స్టేషన్లలో కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ సందడి చేస్తున్నారు.