New Year Special: హైదరాబాద్‌ వాసులకు మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |
New Year Special: హైదరాబాద్‌ వాసులకు మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకల(New Year celebrations) వేళ హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో(Hyderabad Metro) అధికారులు శుభవార్త చెప్పారు. మెట్రో రైలు సమయ వేళలు పొడిగించారు. మంగళవారం రోజున రాత్రి 12:30 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్‌ 31న వేడులకు జరుపుకొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హైదరాబాద్‌ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మరిన్ని మెట్రో రైళ్లను నడపున్నట్లు తెలిపింది. అర్థరాత్రి వరకు వేడుకలు జరుపుకొని సురక్షితంగా ఇంటికి వెళ్లేందుకు ఈ సమయం వేళలు పొడిగించినట్లు తెలుస్తోంది. మెట్రో యాజమాన్యం నిర్ణయంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed