KCR : రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు : కేసీఆర్

by M.Rajitha |
KCR : రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు : కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) రాష్ట్ర ప్రజ‌ల‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు(Christamas Wishes) తెలిపారు. పాపుల‌ను సైతం క్షమించిన క్రీస్తు మాన‌వాళికి ఆద‌ర్శం అని ఆయ‌న పేర్కొన్నారు. విద్వేషాన్ని వీడి వివేకంతో జీవించాల‌నేదే క్రీస్తు బోధ‌నా సారాంశం అని చెప్పారు. విశ్వశాంతిని కాంక్షించే ప‌రోప‌కారుల‌కు యేసు బోధ‌న‌లు అనుస‌ర‌ణీయం అని పేర్కొన్నారు. ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో క్రిస్టియ‌న్ మైనార్టీల‌కు ప‌లు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమ‌లు చేశామ‌ని గుర్తు చేశారు. స‌ర్వమ‌త స‌మాన‌త్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచ‌రించింది.. క్రిస్మస్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింద‌ని కేసీఆర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed