- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Meenakshi Natarajan : గాంధీ భవన్లో "మీనాక్షి" ఎఫెక్ట్

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై హైదరాబాద్‌లోని గాంధీ భవన్రూపు రేఖలు మారనున్నాయి. ఎప్పడు నేతలు, నాయకుల కటౌట్లు, బ్యానర్లు, ఫెక్సీలలతో కలకలలాడే గాంధీ భవన్ కాస్తా ఖాళీగా కనిపినున్నది. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఎఫెక్ట్‌తోనే గాంధీ భవన్లో కటౌట్లు, బ్యానర్లు, ఫెక్సీలు కనిపించకుండా పోనున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జీగా బాధత్యలు చేపట్టాక ఆమె తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు. గాంధీ భవన్లో శుక్రవారం నిర్వహిస్తున్న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు. నూతన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మొదటిసారి తెలంగాణ కు విచేస్తున్న సందర్భంగా ఎలాంటి హంగులు, ఆర్భాటాలు ఉండవద్దని మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు స్వాగత తోరణాలు, ఫ్లెక్సీ లు, బొకేలు, శాలువలు ఎవరు ఏర్పాటు చేయవద్దని ఇది వరకే సూచించారు. మీనాక్షి నటరాజన్‌కు కాంగ్రెస్ పార్టీలో సింప్లిసిటీ ఉమెన్‌గా పేరున్నది.
ఆమె చాలా స్టిక్ట్ లీడర్అని, ప్రచార ఆర్భాటాలు, ఆడంబరాలకు అస్సలు నచ్చవని పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఇకపై గాంధీ భవన్ లో, పరిసర ప్రాంతాలలో కూడా నేతలు, నాయకుల కటౌట్లు, బ్యానర్లు, ఫెక్సీలలతో ఉండకుండా టీపీసీసీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉన్న నేతల, నాయకుల తోరణాలు, కటౌట్లను తొలగించారు. కేవలం అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతల ఫొటోలు ఉండేలా చూస్తున్నారు. గాంధీ భవన్లో నిర్వహిస్తున్న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మీనాక్షి నటరాజన్తోపాటుగా అలాగే, ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, కీలక నేతలు కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతానికి మీనాక్షి నటరాజన్ రాకతో గాంధీ భవన్లో తీసుకున్న చర్యలతో సర్వాత్రా చర్చ జరుగుతోంది.