- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking News : మేడిగడ్డ ఘటన.. గులాబీ నేతల పిటిషన్ పై హైకోర్ట్ కీలక నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం(Kaleshwaram) ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగిన ఘటనలోజిల్లా కోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)లు హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన కోర్ట్ కీలక నిర్ణయం వెల్లడించింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్టు తెలిపింది. అయితే మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయంలో రాజలింగమూర్తి(Rajalingamurti) అనే వ్యక్తి భూపాలపల్లి కోర్టు(Bhupalapalli Court)లో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులపై గులాబీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. జిల్లా కోర్టుకు తన పరిధిలో లేని అంశానికి నోటీసులు జారీ చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా భూపాలపల్లి కోర్టులో పిటిషన్ వేసిన ఫిర్యాదుదారుడు రాజలింగమూర్తి ఇటీవలే హత్యకు గురయ్యారు. ఫిర్యాదు దారుడు మృతి చెందితే పిటిషన్ కు విచారణ అర్హత ఉండదని తెలిపగా.. ఫిర్యాదుదారుడు మృతి చెందినా విచారణ కొనసాగించవచ్చని పీపీ తన వాదన వినిపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.