కార్మికులు ఆరోగ్య నియమాలు పాటిస్తూ విధులకు హాజరు కావాలి.. జోనల్​ కమిషనర్​

by Sumithra |   ( Updated:2024-09-30 15:34:39.0  )
కార్మికులు ఆరోగ్య నియమాలు పాటిస్తూ విధులకు హాజరు కావాలి.. జోనల్​ కమిషనర్​
X

దిశ, కూకట్​పల్లి : కార్మికులు ఆరోగ్య నియమాలు పాటిస్తున్న విధులకు హాజరు కావాలని కూకట్​పల్లి జోనల్​ కమిషనర్​ అపూర్వ్​ చౌహాన్​ అన్నారు. స్వచ్చతా హి సేవ 2024 కార్యక్రమంలో భాగంగా సోమవారం కూకట్​పల్లిలో పారిశుధ్య కార్మికుల కోసం నిర్వహించిన స్వచ్చ శిబిర్​ వైద్య శిబిరం, పోషక ఆహారం పై అవగాహన కార్యక్రమాన్ని జోనల్​ కమిషనర్​ అపూర్వ్​ చౌహాన్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్​ కమిషనర్​ మాట్లాడుతూ స్వచ్చ కార్మికులు అందరు ఆరోగ్య నియమాలు పాటించాలని, అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈఎస్​ఐ ఆసుపత్రిని వినియోగించుకుని ఆరు నెలలకు ఒక సారి తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. బీపీ, షుగర్​ ఉన్నట్లయితే క్రమం తప్పకుండా మందులు వాడాలని కోరారు.

అనంతరం ఎన్​ఐఎన్ ​(నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ న్యూట్రిషన్​) హైదరాబాద్​ వైద్యులు డాక్టర్​ రాజేందర్​ కుమార్​, డాక్టర్​ ఫెర్నాండెజ్​లు మాట్లాడుతూ కార్మికులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషక ఆహార ప్రాముఖ్యత అవసరమని అన్నారు. కార్మికులు ఆకు కూరలు, కూరగాయలు, సీజనల్​ పండ్లు ఎక్కువగా తీసుకోవాలని, దాని ద్వారా పోషక ఆహార లోపలు లేకుండా ఉంటుందని, వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని అన్నారు. అనంతరం కార్మికులకు ఈఎస్​ఐ వైద్యులు బీపీ, షుగర్​ వ్యాధులకు సంబంధించిన వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీ కృష్ణయ్య, డీఈఈ, పారిశుధ్య విభాగం అధికారి శ్రీనివాస్​ రావు, డీసీ ఎస్​డబ్ల్యూఎం ఉదయ్​, ఎస్​ఎస్​ మనోహర్​ రెడ్డి, ఈఎస్​ఐ వైద్యులు డాక్టర్​ గోపిక, డాక్టర్​ శిబియ, డాక్టర్​ అజిత, ఎస్​ఆర్​పీ సత్యరాయణ, సుబ్బారావు, చైతన్య, ఎస్​ఎఫ్​ఏలు గోపాల్​ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed