- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదల జోలికి వస్తే ఖబడ్దార్
దిశ, కూకట్ పల్లి : పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కూకట్ పల్లి నియోజక వర్గం ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ బోయిన్ చెరువును ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. బోయిన్ చెరువు సమీపంలో నివసిస్తున్న వారికి రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేస్తుందటంతో సమాచారం అందుకున్న ఈటెల రాజేందర్ చెరువును సందర్శించారు.
ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 1982లో ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్న 125 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు లాంటి వాళ్లకు ఎన్ కన్వెన్షన్ మాత్రమే కనిపిస్తుందని ఆరోపించారు. 60 గజాలలో ఇండ్లు కట్టుకున్న పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదు ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ ను నోటీసులు అందిన వారు కలిసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బీజేపీ ఇన్చార్జి మాధవరం కాంతారావు పాల్గొన్నారు.