- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాన్యుడి భూమిపై వక్ఫ్ పెత్తనమేంటి
దిశ, మేడ్చల్ బ్యూరో : సామాన్యుల భూములపై వక్ఫ్ పెత్తనం ఏమిటని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఒక్క నోటిఫికేషన్ తో ఆ భూములపై హక్కులన్నీ పోతాయా..? పట్టా భూములన్నీ వక్ఫ్ ఆస్తులు అవుతాయా..? అని నిలదీశారు. మరి 50 ఏండ్లుగా జరిగిన లావాదేవీల సంగతేంటని ప్రశ్నించారు.
గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్లనే తెలంగాణలో వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయని పేర్కొన్నారు. 52(ఏ) చట్టం కింద కబ్జాదారులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వక్ఫ్ సీఈఓ, ఆడిటింగ్ ఇన్ స్పెక్టర్ ముత్తువల్లికి తెలియకుండానే వక్ఫ్ స్థలాలు కబ్జాలకు గురయ్యయా .? అని ధజమెత్తారు.
పేదలపైనే ప్రతాపమా..?
ఇటీవల వక్ఫ్ బోర్డు సీఈఓ ఆ ల్యాండ్స్ వక్ఫ్ కు చెందిన ఆస్తులంటూ ధరణి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల వెబ్ సైట్ లో పేర్కొన్నారని, నిషేధిత జాబితాలో నమోదు చేసి వేలాది మందిని ముప్పు తిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు సీఈఓ అనాలోచిత నిర్ణయాల వల్ల మల్కాజిగిరి సర్కిల్ ప్రాంతంలో దాదాపు 70 కాలనీలు, బస్తీలకు చెందిన పేద ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాత ముత్తాల నుంచి అనుభవిస్తూ 50, 100 గజాలలో ఇండ్లు నిర్మించుకున్న పేదవారిని వక్ప్ బోర్డు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వేల ఎకరాలు కబ్జా చేసిన బడా బాబుల జోలికి వెళ్లడం లేదని, వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.
కబ్జాదారులపై చర్యలేవి..?
మల్కాజ్ గిరి సర్కిల్ లోని సర్వే నెంబర్ 398,399లలో దాదాపు 20 ఎకరాల వక్ఫ్ బోర్డు ఖాళీ స్థలాన్ని పోలీసుల సహకారంతో కబ్జా చేస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. గెజిట్ నెంబర్ 6(A) ప్రకారం వక్ఫ్ బోర్డ్ భూమి లిస్ట్ లో రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22 (ఏ) నిషేధిత జాబితాలో లో 20 ఎకరాల భూములు ఉన్నాయని వక్ఫ్ బోర్డు పేర్కొందని, మరి రూ. వందల కోట్ల విలువైన భూములను బడా నేతలు కబ్జా చేస్తున్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో సీఈఓ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వక్ఫ్ భూమిని కాపాడాల్సిన సీఈఓ ముత్తవల్లి వక్ఫ్ బోర్డ్ చట్టం సెక్షన్ 52(ఏ) కింద కేసులు నమోదు చేయడంలో విఫలం అయ్యారని మండి పడ్డారు. ఇప్పటికైనా ఆ భూమిని కాపాడాలని, కబ్జా చేసిన వాళ్లపై వక్ఫ్ బోర్డ్ చట్టం సెక్షన్ 52(ఏ) కింద పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేస్ లు నమోదు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లేని పక్షంలో వక్ఫ్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.