జవహర్‌నగర్ ముఖ చిత్రాన్ని మర్చుతాం :మంత్రి కేటీ‌ఆర్

by samatah |
జవహర్‌నగర్ ముఖ చిత్రాన్ని మర్చుతాం :మంత్రి కేటీ‌ఆర్
X

దిశ ప్రతినిధి,మేడ్చల్/జవహర్ నగర్ : జవహర్‌నగర్‌ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటికే వ్యర్థాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న జీహెచ్‌ఎంసీ, తాజాగా కొన్నేండ్లుగా పేరుకుపోయిన లిక్విడ్‌ వేస్ట్‌ (లీచెట్‌) శుద్ధి చేసే ప్రయత్నాల్లో విజయం సాధించబోతున్నది. ఈ మేరకు జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు ప్రాంగణంలో కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్‌) శుద్ధి ప్లాంట్‌ను రూ. 250 కోట్లతో రాంకీ సంస్థ రెండు ఎంఎల్‌డీల సామర్థ్యంతో నిర్మించింది. ఈ ప్లాంట్‌ను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు.

పట్టాల పంపిణీ..

జవహర్ నగర్‌లో నివసిస్తున్న పేదలకు జీవో 58 కింద 3619 మంది లబ్ధి‌దారులకు పట్టాలను మంత్రి కేటీ‌ఆర్ అందజేశారు.మిగితా వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు . ఈ కార్య క్రమంలో ఎమ్మెల్సీ శంభిపుర్ రాజు, బల్దియా మేయర్ విజయ లక్ష్మి,ఎంపీ అయోధ్య రామయ్య,జెడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి,కలెక్టర్ అమోయ కుమార్,మేయర్ మేకల కావ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed