ఉప్పల్ అసెంబ్లీ టికెట్ నాకే కేటాయించాలి : Ragidi Laxma Reddy

by Dishaweb |   ( Updated:2023-08-23 14:04:28.0  )
ఉప్పల్ అసెంబ్లీ టికెట్ నాకే కేటాయించాలి : Ragidi Laxma Reddy
X

దిశ,ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ టికెట్ నాకే కేటాయించాలని కోరుతూ గాంధీభవన్లో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి దరఖాస్తు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందిస్తున్నానని చెప్పారు.కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ,రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఎన్ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శిగా,గ్రేట్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా,పిసిసి సెక్రెటరీగా,పిసిసి జనరల్ సెక్రటరీగా,ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని రాగిడి తెలియజేశారు. అలాగే గత 20 సంవత్సరాలుగా మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి, అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వారికి ట్రస్టు ద్వారా వేలాది మందికి సహాయ సహకారాలు అందించానని తెలిపారు.

కావున ఈ ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ సీటు (టికెట్)తనకే కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడల మల్లికార్జున్ గౌడ్, మీర్పేట్ హౌసింగ్ బోర్డు డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ పులిపాక అంజయ్య,రామంతపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ రఫీక్, టిపిసిసి మైనారిటీస్ జనరల్ సెక్రెటరీ సంజయ్ జైన్, టిపిసిసి సభ్యులు వినోద్ ముదిరాజ్, టిపిసిసి మైనారిటీ జనరల్ సెక్రెటరీ షేక్ మదర్ వలి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పత్తి కుమార్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మైనారిటీస్ చైర్మన్ అబ్దుల్ రషీద్ ఆశు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ గణేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, బొట్టు రాజేష్, రాజ్యలక్ష్మి, నూకల ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మి, నెమలి అనిల్, మల్కాజ్గిరి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంజరి సంతోష్, ఉప్పల్ అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షులు రమేష్ నాయక్, హబ్సిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కిషన్ నాయక్, ఉప్పల్ ఎస్సీ సెల్ చైర్మన్ హెచ్ఆర్ మోహన్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి సాల్మన్ బాబు, మురళీకృష్ణ ముదిరాజ్, శ్యాం కుమార్, బి. ఎస్. రెడ్డి, లాజర్, ఎండి రిజ్వాన్, గోపాల్ యాదవ్, కాసుల సతీష్ గౌడ్, యువజన నాయకుడు ప్రేమ్ కుమార్ గౌడ్, ఖదీర్, సందీప్ గౌడ్, మల్లికార్జున్, నవీన్, రాజేష్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ, మల్లాపూర్ ఎస్టీ సెల్ చైర్మన్ మహేష్ నాయక్, మల్లేష్ యాదవ్, చందు యాదవ్, హీరాలాల్, నరసింహ ముదిరాజ్, కిరణ్, సురేష్, శ్రావణ్ కుమార్, పవన్ కుమార్ రెడ్డి, నిమ్మ సురేందర్ రెడ్డి, ఉప్పల్ డివిజన్ మైనార్టీస్ చైర్మన్ గజ్జల రాజు, హబ్సిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాము నాయక్, శ్రీకాంత్ నాయక్, గొల్లూరి ప్రభాకర్, ఉప్పల్ నియోజకవర్గం బి బ్లాక్ మైనారిటీస్ వైస్ చైర్మన్ జహీరుద్దీన్, అమీర్, పవన్ సన్నీ గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed