పట్టపగలే దొంగల హల్..చల్

by Shiva |   ( Updated:2023-02-15 16:42:42.0  )
పట్టపగలే దొంగల హల్..చల్
X

దిశ, మరికల్: మండల కేంద్రంలో బుధవారం పట్టపగలు తాళం వేసిన ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం విరగ్గొట్టి ఇంట్లోకి చొరబడి బంగారు వెండి నగలు, నగదు దోచుకెళ్లారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన కురువ లంబాడి నరసింహులు వృత్తిరీత్యా మరికల్ చౌరస్తాలోని షాప్ లో కొబ్బరి బొండాలు విక్రయిస్తుంటాడు. యధావిధిగా బుధవారం ఉదయం 9గంటలకు కుటుంబ సభ్యులందరూ షాప్ దగ్గరికి వెళ్లారు.

మధ్యాహ్నం 12.30కి నరసింహులు తన ఇంటి దగ్గర ఉన్న కుక్క పిల్లలకు అన్నం, పాలు పెట్టేందుకు వెళ్లగా అప్పటికే ఇంటి తాళం విరుగగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూశాడు. బీరువా తాళాలు విరగొట్టి బీరువాలో ఉన్న రూ.లక్ష, రెండు తులాల బంగారు పుస్తెల తాడు, మూడు తులాల బంగారు నాను, 20 తులాల వెండి చైన్ లు ఎత్తుకెళ్లారని వాటి విలువ సుమారు రూ.2.30 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అశోక్ బాబు తెలిపారు.

Advertisement

Next Story