Uppal MLA : ఆదర్శనగర్ డంపింగ్ యార్డ్‌పై జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ ఉండాలి

by Aamani |
Uppal MLA : ఆదర్శనగర్ డంపింగ్  యార్డ్‌పై జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ ఉండాలి
X

దిశ, కాప్రా : ఇంటింటికి చెత్త సేకరణ, ఆదర్శ నగర్ డంపింగ్ యార్డ్ నిర్వహణ పై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. గురువారం ఆదర్శనగర్ డంపింగ్ యార్డ్ నిర్వహణపై డాక్టర్ ఏఎస్ రావు నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ముకుంద రెడ్డి సర్కిల్ ఏ ఎమ్ ఓ హెచ్ డాక్టర్ లావణ్య, రామ్కీ సంస్థ, చర్లపల్లి కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు స్వచ్ఛ ఆటో వాలాల తో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాహనాల సంఖ్యను పెంచాలని ఆదర్శనగర్ డంపింగ్ యార్డ్ మెకానిజంను అన్ని విధాల ఆధునీకరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రామ్ కి సంస్థల ప్రతినిధులకు స్పష్టం చేశారు. రామ్కీ సంస్థ వాహనాల పెంపు ఆదర్శనగర్ డంపింగ్ యార్డ్ నిర్వహణపై వారం రోజుల వ్యవధిలో సమూలంగా మార్పులు జరగాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జిహెచ్ఎంసి అధికారులను రాంకీ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు నాయకులు కాసం మైపాల్ రెడ్డి, ఎంపల్లి పద్మారెడ్డి, బైరి నవీన్ గౌడ్, కుమారస్వామి, గంప కృష్ణ, ఎస్ ఏ రహీం, సారా అనిల్ ముదిరాజ్, సారా వినోద్, నవీన్, నరసింహ వంశరాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed