- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 ఏళ్లుగా ఉంటున్న వారి జోలికి వస్తే ఊరుకునేది లేదు
దిశ, కూకట్పల్లి : 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా అధికారులను హెచ్చరించారు. అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్, సఫ్దర్‌నగర్, పద్మావతినగర్ కాలనీలలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ సబీహ బేగంతో కలిసి పర్యటించారు. నోటీసులు అందుకున్న కుటుంబాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబీహ బేగంలు కలిసి వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాజీవ్‌గాంధీనగర్ కాలనీ ఏర్పాటు జరిగిందని, సఫ్దర్‌నగర్, పద్మావతినగర్ ప్రాంతాలలో 40 సంవత్సరాలుగా వందలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయని అన్నారు.
కూలీ పని చేసుకుని జీవిస్తున్న నిరుపేద కుటుంబాలు జీవనం గడుపుతున్న కాలనీలలోని ఇండ్లకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయడం బాధాకరమైన విషయమని అన్నారు. హైడ్రా అధికారులు బడా బాబులు చెరువులు, కుంటలు కబ్జా చేసి భవంతులు నిర్మించుకుంటే వాటిని కూల్చడం మర్చిపోయి పేద వారు నివసించే ప్రాంతాలలో కూల్చివేతలు చేపట్టడం సరికాదని అన్నారు. కొంత మంది రాజకీయ నాయకులు, పార్టీ లీడర్లతో ఫొటోలు దిగి స్థానికంగా నిర్మిస్తున్న బిల్డింగ్‌ల వద్దకు వెళ్లి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుపేదలు నివసించే ప్రాంతాలలో హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి ప్రజలను నిద్ర లేకుండా భయబ్రాంతులకు గురి చేస్తే వారు తిరగబడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, బీఆర్ఎస్ జిల్లా మైనారిటి విభాగం అధ్యక్షుడు ఎండి. గౌసుద్దిన్, డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐలయ్య, సయ్యద్ రియాజ్, మొహ్మద్ తదితరులు పాల్గొన్నారు.