ఎక్కడ చూసినా సమస్యలే

by Sridhar Babu |   ( Updated:2024-10-22 13:28:08.0  )
ఎక్కడ చూసినా సమస్యలే
X

దిశ, కూకట్​పల్లి : మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన ఐదు నెలలుగా నిరంతరం ప్రజా క్షేత్రంలో తిరుగుతుంటే ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్​ అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం ఫతేనగర్​ డివిజన్​ భరత్​నగర్​ కాలనీలో మంగళవారం ఈటెల రాజేందర్​ పర్యటించారు. భరత్​నగర్​ పార్కును సందర్శించి వాకర్స్​తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన నాటి నుంచి మల్కాజిగిరి పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పర్యటిస్తున్నానని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి సమస్యలు వెల్లువగా వస్తున్నాయని అన్నారు.

కలెక్టర్​, హెచ్​ఎండీఏ కమిషనర్​, జలమండలి ఎండీలను కలిసి సమస్యలపై ప్రశ్నిస్తే నిధులు లేవని సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. దాంతో కేంద్రంలో అర్బన్​ డెవలప్​మెంట్​ మంత్రిని కలిసి నిధులు కేటాయించాలని కోరినట్టు తెలిపారు. చెరువులలో మురుగు నీరు కలవకుండా ఎస్​ఎన్​డీపీ కార్యక్రమం తీసుకువచ్చి దానికి నిధులు కేటాయించాలని కోరినట్టు తెలిపారు. మూసీ ప్రక్షాళన చేయడం తరువాత కానీ ముందు మురుగు నీళ్లను శుద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, చేస్తున్న పద్ధతికి వ్యతిరేకమని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీజేపీ ఇన్​చార్జి మాధవరం కాంతారావు, కార్పొరేటర్​ కొడిచర్ల మహేందర్​, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, రామ్మోహన్ రావు, కృష్ణగౌడ్, నాగిరెడ్డి, భిక్షపతి, శ్రీకరరావు, ఐలన్న, విజయ్ కుమార్, కృష్ణయ్య, వేణు, శ్రీనివాసరెడ్డి, మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story