- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్యూరిటీ గార్డు ప్రాణం తీసిన లారీ
దిశ, కూకట్పల్లి : రోడ్డు ప్రమాదంలో ఓ సెక్యూరిటీ గార్డు మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ పోలీసులు ఎస్సై శ్రీలత తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన సాలెగ రమేష్(43) తన కుటుంబ సభ్యులతో నగరానికి వలస వచ్చి గాజుల రామారం వీణ ఎన్‌క్లేవ్‌లో నివసం ఉంటున్నాడు.
రమేష్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండే వాడు. రోజు వారి మాదిరిగానే రమేష్ విధులు ముగించుకుని మంగళవారం తెల్లవారు జామున 3:45 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా కేపీహెచ్‌బీ కాలనీ ఆల్మండ్ స్వీట్‌హౌస్ ఎదురుగా యూ టర్న్ చేస్తుండగా వెనక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన గుర్తు తెలియని లారీ రమేష్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రమేష్ వద్ద ఉన్న సెల్ ఫోన్లో లభించిన వివరాల ప్రకారం రమేష్ భార్య సాలెగ భారతికి సమాచారం అందించారు. తన భర్త మరణానికి కారణమైన లారీ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీలత తెలిపారు.