- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులపై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి
దిశ, మేడ్చల్ బ్యూరో : వికారాబాద్ జిల్లా పాలనాధికారులపై దాడి చేయడాన్ని మేడ్చల్ జిల్లా అధికారులు, ఉద్యోగులు తీవ్రంగా పరిగణించారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర అధికారులపై దాడిని నిరసిస్తూ టీజీఈజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలను ధరించి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా టీజీఓ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు జి.వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా పనిచేస్తారని, వారికి పర్సనల్ ఎజెండా ఉండదన్నారు. ప్రభుత్వ సూచనలను ప్రజలకు తెలియజేయడమే వారి విధి అన్నారు. అలాంటి అధికారులపై దాడి చేయడం అమానుషమన్నారు. దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దన్నారు. ఈ ధర్నాలో టీజీఓ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కురుమూర్తి, వైస్ ప్రెసిడెంట్ ఐ.విజయకుమారి, కలెక్టరేట్ ఏఓ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీఆర్వో హరిప్రియలకి వినతి పత్రం అందజేశారు.