కంటోన్మెంట్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు - రామక్రిష్ణ

by Sumithra |
కంటోన్మెంట్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు - రామక్రిష్ణ
X

దిశ, కంటోన్మెంట్ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని కంటోన్మెంట్ బోర్డు నామినేటేడ్ సభ్యులు జె.రామక్రిష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ అభివృద్ధి విషయంలో పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆదివారం ఐదో వార్డులోని శాంతి దీప్ కాలనీలో మీట్ యువర్ మెంబర్ కార్యక్రమాన్ని రామకృష్ణ నిర్వహించారు. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి దీప్ కాలనీ వాసులు సమస్యలను తెలుసుకున్నానని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన నాళాలు, వాటర్ లైన్, సీసీ రోడ్డు, వీధి దీపాలు తదితర సమస్యలను కాలనీ వాసులు ప్రస్తావించగా, కొద్ది రోజుల్లో వాటి పనులు చేపడతామని అన్నారు. నాళాలకు సంబంధించి శాశ్వత పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని దానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజక వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వదిలివేసిందని, కంటోన్మెంట్ అభివృద్ధికి కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. తాగునీటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంభిస్తుందన్నారు. కంటోన్మెంట్ ప్రజల గొంతు కోస్తుందని, రాష్ట్రప్రభుత్వ తీరుకు నిరసనగా కంటోన్మెంట్ ప్రజలు పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎనలేనిదని, కేంద్ర ప్రభుత్వ నిధులు, బోర్డు నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.

వికసిత భారత్ నిర్మాణానికి సహకరించండి..

దేశంలో ఈ పదేళ్ల కాలంలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, రోడ్లు, రైళ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్, సంక్షేమ పథకాలు, విదేశీ విధానం, ఉచిత రేషన్, ధర్మ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వ పునరుద్దరణ వంటి అనేక విషయాల్లో బీజేపీ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని పేర్కొంటూ వికసిత భారత్ నిర్మాణంలో అందరి భాగస్వామ్యం కోసం బీజేపీలో సభ్యత్వం తీసుకుని బీజేపీతో కలిసి నడవాలని తెలిపారు. అందుకు 8800002024 నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాంతి దీప్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story