- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయన్న అంత్యక్రియల్లో ఉద్రిక్తత: తెలంగాణేతరులకేనా ప్రభుత్వ లాంఛనాలు
దిశ, కంటోన్మెంట్: అధికార పార్టీ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణేతరులు చనిపోతే (సినిమా నటులు) అధికార లాంఛానలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న తెలంగాణ సర్కార్.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్నపై ఎందుకింద వివక్ష అంటూ సాయన్న అభిమానులు, పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏలాంటి అవినీతి , అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా ప్రజల మన్ననలతో ఎమ్మెల్యేగా గెలిచిన దళిత ఎమ్మెల్యేను అవమానిస్తున్నారంటూ అభిమానులు ఆందోళనకు దిగడంతో సోమవారం రాత్రి మారేడ్ పల్లి శ్మశానవాటికలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకోన్నాయి.
కంటోన్మెంట్ నియోజకవర్గం కార్ఖానాలోని సాయన్న క్యాంపు కార్యాలయం నుంచి వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగింది. మరికాసేపట్లో అంత్యక్రియలు పూర్తవుతాయనగా, అనుచరులు అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు. సాయన్న చితిపై ఉండగానే అధికార బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే సాయన్నకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలంటూ మెరుపు ధర్నాకు దిగారు. మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆందోళనకారులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. ఆందోళనకారులు వినిపించుకోలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంత్రులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. డీప్యూటీ స్పీకర్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన ఫలితం లేకుండా పోయింది.
అధికారిక లాంఛనాలపై కలెక్టర్ నుంచి ఎలాంటి అదేశాలు రాలేదని, అందువల్లనే ఏర్పాట్లు చేయలేదని డీసీపీ స్థాయి అధికారి తెలియజేసినట్లు సమాచారం. అధికారిక ఉత్తర్వులకు సమయం పడుతుందని, చీకటి పడుతున్నందున అంత్యక్రియలకు బాగా అలస్యమైందని, అంత్యక్రియలు సజావుగా సాగేందుకు సహకరించాలని పోలీసులు కోరినట్లు తెలిసింది. దీంతో జైభీమ్ .. జై సాయన్న నినాదాలు మిన్నంటాయి. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ఒక్కసారిగా ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్థీవ దేహాన్ని చితిపై పెట్టి గంటలు గడచినా.. ప్రభుత్వం నుంచి ఏలాంటి స్పందన రాకపోవడంతో సాయన్న కుమార్తె అభ్యర్థన మేరకు ఆందోళనకారులు శాంతించారు.
పోలీస్ భద్రత నడుమ సాయన్న అంత్యక్రియలను అధికార లాంఛనాలు లేకుండానే సాదాసీదాగా ముగించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాత తెలంగాణ సర్కార్ తెలంగాణేతరులపై ప్రేమ కనబరుస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించని ప్రభుత్వం ఇటీవల మృతి చెందిన సినీ నటులు కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడంపై తెలంగాణ ఉద్యమ కారులు మండి పడుతున్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వం ఇంతలా అవమానించడం తగదని హెచ్చరిస్తున్నారు. ఆదివారం కన్నుమూసిన సాయన్నకు సీఎం కేసీఆర్, శాసన మండలి ఛైర్మన్, శాసనసభ స్పీకర్ తో సహా మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ సైతం నివాళులర్పించినా.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని గుర్తకు రాలేదా..? అని కంటోన్మెంట్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సాయన్న దళితుడని కారణంతోనే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదని మండి పడుతున్నారు.
- Tags
- mla sayanna