శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థి అదృశ్యం..

by Vinod kumar |
శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థి అదృశ్యం..
X

దిశ, మేడిపల్లి: శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడిపల్లి సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బాలరాజు (17) తండ్రి వెంకటయ్య బోడుప్పల్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం విద్యార్థి కనిపించడం లేదని గమనించి సిబ్బంది తల్లిదండ్రులకు తెలియజేయడంతో తెలిసిన బంధువుల వద్ద విచారించగా ఏ విధమైన సమాచారం లేకపోవడంతో బుధవారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నామని తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed