- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీటింగ్ దందాకు ఎస్ఓటీ చెక్.. నలుగురు నిందితులు అరెస్ట్..
దిశ, కుత్బుల్లాపూర్: బ్రాండెడ్ వాటర్ ఫిల్టర్ కంపెనీ లోగోలు వాడుతూ నకిలీ పరికరాలు సరఫరా చేస్తున్న ముఠాకు బాలానగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు చెక్ పెట్టారు. వివరాలు డీసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. కెంట్, ఆక్వాగార్డ్ వాటర్ ఫ్యూరిపయర్ కంపెనీ లోగోలు వాడుతూ ఆయా కంపెనీల డీలర్లు వినియోగదారులను మోసం చేస్తున్నారు. కేపీహెచ్ బీ, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ల పరిధిలో రింకు నవి, శ్రావణ్ నిషాద్, ప్రదీప్ జైన్, పామర్తి నాగరాజు కంపెనీల లోగోలు తయారు చేస్తూ వాటర్ ఫిల్టర్ పరికరాలు కంపెనీ వస్తువులుగా నమ్మిస్తూ వినియోగదారులని మోసం చేస్తున్నారు.
నకిలీ వస్తువులు తయారు చేసి లోగోలు మార్చి కస్టమర్స్ కు అంటగడుతున్న చీటింగ్ దందాను పోలీసులు పటాపంచలు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సుమారు రూ. 11 లక్షల విలువ గల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏసీపీ చంద్రశేఖర్, కూకట్పల్లి, కేపీహెచ్ బీ కాలనీ ఎస్ హెచ్ఓలు, ఎస్ఓటీ పోలీసులు పాల్గొన్నారు.