ప్రకాష్​నగర్‌లో దగ్ధమైన గుడిసెలను పరిశీలించిన రెవెన్యు అధికారులు

by Disha News Desk |
ప్రకాష్​నగర్‌లో దగ్ధమైన గుడిసెలను పరిశీలించిన రెవెన్యు అధికారులు
X

దిశ, కూకట్‌పల్లి: బాలానగర్​మండల పరిధిలోని బేగంపేట్ ప్రకాష్​నగర్‌లో గ్యాస్ సిలిండర్​పేలి అగ్నిప్రమాదం చోటు చేసుకుని దగ్ధమైన గుడిసెలను మండల డిప్యుటి తహసిల్దార్​కృష్ణయ్య, ఆర్‌ఐ గాయత్రి దేవిలు సందర్శించారు. గుడిసెల అగ్ని ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంలో 3.5 లక్షల నగదు, 20 గ్రాముల బంగారు ఆభరణాలు, దుస్తులు పూర్తిగా కాలిపోయినట్టు డిప్యూటీ తహశీల్దార్ కృష్ణయ్య తెలిపారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ పైసా పైసా కూడబెట్టుకుని జీవిస్తున్న వారి గుడిసెలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పేద కుటుంబం రోడ్డున పడింది. కనీసం కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఉన్నారని స్థానికులు తెలిపారు.

Advertisement

Next Story