- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మిని ట్యాంక్ బండ్‌గా రంగధాముని చెరువు: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
దిశ, కూకట్పల్లి: రంగధాముని చెరువును మిని ట్యాంక్ బండ్‌గా సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గం పరిధిలోని బాలాజీనగర్ డివిజన్లో జరుగుతున్న రంగధాముని చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులను, పార్కులు, షటిల్ కోర్టులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం స్థానిక కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని ట్యాంక్ బండ్‌ను పోలినట్టు రంగధాముని చెరువును మిని ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కూకట్పల్లి వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, మంచి ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా పార్కులు, ఓపెన్ జిమ్ లు, క్రీడా మైదానాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, డీఈ ఆనంద్, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ డివిజన్లో...
కేపీహెచ్‌బీ డివిజన్ పరిధిలోని రమ్య గ్రౌండ్ సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావుతో కలిసి పరిశీలించారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ప్రభాకర్ గౌడ్, సాయిబాబా చౌదరి, అడుసుమల్లి వెంకటేశ్వర్ రావు, శ్యామల రాజు తదితరులు పాల్గొన్నారు.