- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rachakonda : సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత చేరువగా రాచకొండ పోలీస్ కమిషనరేట్
దిశ,మల్కాజిగిరి : సామాజిక మాధ్యమాల అకౌంట్ల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ అందరికీ చేరువ చేసేందుకు క్యూఆర్ కోడ్ పోస్టర్లను మంగళవారం నేరేడ్మెట్ లోని రాచకొండ కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా, రాచకొండ పోలీస్ "ఫేస్ బుక్" "ఎక్స్" "ఇన్స్టాగ్రామ్" వంటి సామాజిక మాధ్యమాల అకౌంట్లు ,యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ ఆవరణలో, రిసెప్షన్ లో రాచకొండ పోలీస్ క్యూఆర్ కోడ్ కలిగిన పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రజలంతా ఈ క్యూఆర్ కోడ్ ను ఉపయోగించుకుని, తమ మొబైల్ ఫోన్లలో స్కాన్ చేయడం ద్వారా సంబంధిత రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లకు సులభంగా చేరుకుని సబ్ స్క్రైబ్ చేసుకుని, ఫాలో కావచ్చన్నారు. కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు, వారికి మెరుగైన సత్వర సేవలు అందించేందుకు, వారితో ప్రత్యక్ష సంబంధాలు పెంపొందించుకోవడానికి ఈ సోషల్ మీడియా అకౌంట్లు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు.
ప్రజల్లో రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్ల గురించి మరింత ప్రచారం కల్పిస్తామని, ప్రతీ ఒక్కరు వాటిని ఫాలో కావాలని సూచించారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి పలు అవగాహన కార్యక్రమాల నిర్వహణ, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తు నిర్వహణ సమాచారం అందించడం జరుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రాచకొండ వాట్సాప్ కంట్రోల్ నెంబర్ 8712662111 ద్వారా కూడా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర , ఎల్ బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, డీసీపీ ఎస్బి కరుణాకర్, డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, డీసీపీ మహేశ్వరం సునీత రెడ్ది, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, ఐటీ సెల్ ఏసీపీ నరేందర్ గౌడ్, ఇన్స్పెక్టర్ లు సుధాకర్, గట్టు మల్లు లు పాల్గొన్నారు