ఓటుతో భవిష్యత్తుకు బాటలు వేయండి : గవర్నర్ తమిళిసై

by Aamani |   ( Updated:2024-01-25 14:41:32.0  )
ఓటుతో భవిష్యత్తుకు బాటలు వేయండి  : గవర్నర్ తమిళిసై
X

దిశ, కూకట్ పల్లి: అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించుకొని ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించు కోవాల్సింది గా రాష్ట్ర గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. కూకట్పల్లి లో ఉన్న జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలో ఓటు హక్కు కలిగి ఉన్న వారు విధిగా బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఓటు అని ఆయుధాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని తెలిపారు.

పౌరులు ఓటింగ్ రోజు సెలవు దినంగా భావించకుండా తమ భవిష్యత్తు నిర్ణయించే రోజుగా భావించి ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో యువత అత్యధికంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవడం మంచి పరిణామం అని, రాబోయే ఎన్నికలలో కూడా ఇదే ఉత్సాహంతో యువత ఓటు హక్కును వినియోగించుకోవడం తో పాటుగా ఇతరులను కూడా ఓటు వేసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమానికి ముందు సీఈవో వికాస్ రాజ్, అడిషనల్ సీఈవో లోకేష్ కుమార్, జిల్లా కలెక్టర్ గౌతమ్ తదితరులు గవర్నర్కు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, ఆయా పోటీల్లో విజేతలైన విద్యార్థులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అందజేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, తదితరులు పాల్గొన్నారు.

Read More..

బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు: డీకే అరుణ

Advertisement

Next Story

Most Viewed