మంత్రి రాకతో.. రోడ్డు మరమ్మత్తులు చేసిన అధికారులు..

by Sumithra |   ( Updated:2024-08-04 12:36:48.0  )
మంత్రి రాకతో.. రోడ్డు మరమ్మత్తులు చేసిన అధికారులు..
X

దిశ, ఉప్పల్ : ఉప్పల్ నుంచి నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ స్థితిగతుల పనులను రోడ్డు భవనాల, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యవేక్షించడానికి వస్తున్న సందర్భంగా ప్రధాన రహదారిలో ఉన్న గుంతలను పూడ్చి రోడ్డు మరమ్మత్తులు చేసిన అధికారులు. ఉప్పల్ నుంచి బోడుప్పల్ వెళ్లే ప్రధాన రహదారి అంత గుంతలతో, దుమ్ము ధూళితో అద్వానంగా తయారైంది.

గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు మరమ్మత్తులు చేపట్టని అధికారులు నేడు మంత్రి రాకతో రాత్రికిరాత్రే కొన్ని చోట్ల మాత్రమే గుంతలు కనిపించకుండా రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఇన్నిరోజుల నుంచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకోని అధికారులు మంత్రి వస్తున్నాడని తెలిసిన వెంటనే గుంతలు కనిపించకుండా రోడ్డు మరమ్మతులు చేపట్టడం విడ్డూరంగా ఉందని వాహనదారులు, పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Advertisement
Next Story

Most Viewed