ఏ మంత్రి నాకు ఫోన్ చేయలేదు: ఈటెల

by Shiva |
ఏ మంత్రి నాకు ఫోన్ చేయలేదు: ఈటెల
X

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలే..

దిశ, జడ్చర్ల: అసెంబ్లీలో మాట ఇచ్చిన ప్రకారం స్కాలర్ షిప్ కోసం ఇంకా ఏ మంత్రి తనకు ఫోన్ చేయలేదని కేసీఆర్ సభ సాక్షిగా అబద్ధాలు చెప్పారని ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం జడ్చర్ల పట్టణ పరిధిలోని గాంధీ చౌక్ వద్ద ప్రజాగోష బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దళిత బిడ్డ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను అధికార లాంఛనలతో నిర్వహించపోవడమే కేసీఆర్ కు దళితుల పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిదో అర్థం అవుతోందన్నారు.

0.6% ఉన్న కులానికి మంత్రి పదవులు ఎన్ని, 17% ఉన్న దళితులకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారో ప్రజలు గమనించాలన్నారు. ప్రభుత్వం తాము ఇస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక, రైతుబంధు సాయం వారి సొంత ఖజానాలోంచి ఇస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్నర్ మీటింగ్ లలో మమ్మల్ని అందరూ అడుగడుగునా కేసీఆర్ ఇస్తామన్న వడ్డీ లేని రుణాలు, డబుల్ బెడ్ రూం ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఏం చెప్పిన వారికి ఓటేసే ప్రసక్తే లేదన్నారు. కార్నర్ మీటింగ్ లతో ప్రజలకు బీజేపీ మరింత దగ్గరైందని, రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నాయకత్వం వహించేది బీజేపీ పార్టీ అని అన్నారు.

ప్రజలు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో కాషాయ జండా ఎగరడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు వీరబ్రహ్మ చారి, ఎంపీ వెంకటేష్, బాలా త్రిపుర సుందరి, జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, బీజేపీ పట్టణాధ్యక్షుడు సామల నాగరాజు, కౌన్సిలర్ కుమార్ రాజు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాహితి రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లె తిరుపతి, మిడ్జిల్ మండల బీజేపీ అధ్యక్షుడు కావలి నరేందర్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొంగలి శ్రీకాంత్, బీజేపీ నాయకులు గౌరీశంకర్, వెంకట్, మధు, శ్రీకాంత్, నరేష్, పలువురు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed