- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు : హరీష్ రావు
దిశ,నాచారం : కేసీఆర్ అంటే నమ్మకం అని కేసీఆర్ మాట తప్పడు మడమ తిప్పడని.. తెలంగాణ కోసం పులి నోట్లో తల పెట్టి.. చావు కైనా సిద్ధపడి 14 సంవత్సరాలు పోరాడి కాదన్నా తెలంగాణను తెచ్చి చేతిలో పెట్టాడని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కొనియాడారు. బుధవారం హైదరాబాద్ నాచారం మల్లాపూర్ లో వి ఎన్ ఆర్ గార్డెన్ లో ఉప్పల్ నియోజకవర్గం మహిళా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 11 సంవత్సరాలు పాలించి ఏనాడు మంచినీళ్ల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదని... మహిళలు గ్రామాల్లో వాటర్ ట్యాంకర్ కోసం, నగరాల్లో 2, 3 వేచి చూడాల్సిన దుస్థితి నెలకొందని.. కానీ కేసీఆర్ అధికారంలోకి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు మంచినీటి కష్టాలు తీర్చి, ఉచిత నీటి సరఫరా చేస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి.. గల్లీలో విమర్శిస్తుందని ఆరోపించారు.
మిషన్ భగీరథ ను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో సర్కార్ దావఖనాల పరిస్థితి దయనీయంగా ఉండేదని.. నేను రాను బిడ్డవు సర్కారు దావఖాన కి.. అనే విధంగా ఉండేదని.. నేడు జిల్లాకు ఒక వైద్య కళాశాలలో ఏర్పాటుచేసిన మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి బస్తీలో సుస్థి అయిన వారికి బస్తీ దావఖాన లో అన్ని రకాల ఉచిత సేవలు అందిస్తున్నది నిజమే కదా అని.. అన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 30% ప్రసవం జరిగే అని, నేడు 70% పైగా జరుగుతున్నట్లు చెప్పారు. బిడ్డ తల్లుల సంరక్షణ కోసం కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు అందజేస్తున్నట్లు తెలిపారు.
మహిళల సంక్షేమం కోసం నిరంతరం కేసీఆర్ ఆలోచిస్తున్నారని.. మంత్రి మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ఏం చేయలేదని.. కడుపులో బిడ్డ పుట్టగానే.. న్యూట్రిషన్ కిట్టు, బిడ్డ బయటపడగా.. కెసిఆర్ కిట్టు, పెళ్లి ఈడుకి వస్తే.. కళ్యాణ లక్ష్మి, అడుగులు పడితే.. అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం, పిల్లల చదువులకు ఇంగ్లీష్ మీడియం, అమెరికా చదువులకు 20 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నారని.. కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి వంటి పథకాలతో రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో గల్లి కోక పేకాట క్లబ్బులు ఉండేవని.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి పైన ఉక్కుపాదం మోపిందన్నారు. ప్లేట్ పేకాట క్లబ్ లో ఇల్లు గుల్ల చేసుకొని.. మహిళల మంగళసూత్రాలు తాకట్టు పెట్టి.. ఆగమయ్యారని.. ఈ పరిస్థితులు మనకెందుకని.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాలు తప్పమన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ సాగునీటి కష్టాల తో రైతులు కొట్టుమిట్టాలు ఆడుతుండదని.. కేసీఆర్ పాలనలో సస్యశ్యామలంగా మారి రైతులు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు.
కేసీఆర్ బీమాతో ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు అందుతాయని.. దీనికి దరఖాస్తు లేదని తిరిగేది లేదని.. పట్టణ ప్రాంతాల్లో కూడా సార్ బీమా ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. సన్న బియ్యం కావాలన్నా.. సౌభాగ్య లక్ష్మి కావాలన్నా.. కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం గెలిపించాలన్నారు. బండారు లక్ష్మారెడ్డి ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మహిళలను కోరారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఉప్పల్ ఎన్నికల ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షుడు, మహిళా విభాగం అధ్యక్షులు, మహిళా కమిటీ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.