- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం..
దిశ, కూకట్పల్లి: బాలానగర్ డివిజన్ పరిధిలో రూ. 88 లక్షల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దశలవారిఆ అభివృద్ధి చెందుతూ వచ్చిందని, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.
గడిచిన 9 ఏండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాలలో అభివృద్ధి సాధించిందని అన్నారు. అప్పట్లో కరెంట్ కోతలతో ఇబ్బంది పడిన రాష్ట్రం నేడు మిగులు విద్యుత్ సాధిస్తుందని అన్నారు. నీటి కొరతతో ఇబ్బంది పడిన రాష్ట్రం నేడు మిషన్ కాకతీయతో రైతులకు సాగునీరు పుష్కలంగా అందిస్తుందని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తు పంటల దిగుబడిని భారీగా పెంచిందని గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు.