ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వర్గం అసంతృప్తి

by Dishaweb |   ( Updated:2023-08-22 15:20:22.0  )
ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వర్గం అసంతృప్తి
X

దిశ,ఉప్పల్: తెలంగాణ ముఖ్యమంత్రి ఉప్పల్ నియోజకవర్గం అభ్యర్థి గా బండారి లక్ష్మారెడ్డి ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కి టికెట్ ను ఇవ్వకుండా బండారి లక్ష్మారెడ్డి కి ప్రకటించడం తో స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వర్గం మాత్రం అసంతృప్తి గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే బేతి అనుచరులు మా నాయకునికి ఎందుకు టికెట్ ఇవ్వలేదో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలి అంటూ వాట్సాప్ గ్రూప్ లలో మెసేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి. 2001 తెరాస పార్టీలో చేరి తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నందుకా, ఎన్నో కేసులపాలై జైలుకు వెళ్లినందుకా, అవినీతి రహిత సమాజం కోసం నిజాయితీగా ఉన్నందుకా, ఉద్యమ సమయంలో వేలాది మంది ఉద్యమకారులకు అన్నం పెట్టినందుకా, హైదరాబాద్ పరిసర ప్రాంతంలో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఏకైక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కాదా చెప్పండి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు మీకు కోపం వచ్చిందా...?చెప్పండి కేసీఆర్ సార్, దయచేసి ఒక్క కారణమైన చెప్పండి. మా నాయకుడు బేతి సుభాష్ రెడ్డికి టికెట్ ఎందుకు ఇవ్వలేదో అంటూ వాట్సాప్ లలో మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వర్గం ఉప్పల్ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి కి మద్దతు ఇచ్చి కలిసి కట్టుగా పని చేస్తారా లేదా?అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఎమ్మెల్యే బేతి వర్గం సహకరిస్తారా

ఉప్పల్ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వర్గం సహకరిస్తారన్నది ప్రశ్నగా మారింది.తమ నాయకుడికి టికెట్ రాలేదని బేతి సుభాష్ రెడ్డి వర్గం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఉద్యమకారులకు టికెట్ ఇవ్వకుండా బండారి కి టికెట్ ఇవ్వడంతో భేతి అనుచరులు వాట్సాప్ గ్రూప్ లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నిస్తున్న మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి.

ఉప్పల్‌లో బీఆర్ఎస్ జండా ఎగరవేయడం కాయం-బీఎల్ఆర్

బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశానని అది గుర్తించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నా మీద నమ్మకం ఉంచి ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తానని, ఉద్యమకారులను, సీనియర్ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా ఉప్పల్ నియోజకవర్గంలో లక్ష మెజారిటీతో బీఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయమని అన్నారు.

Advertisement

Next Story