- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికార పార్టీలో తిరుగుబాటు.. మేడ్చల్ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం
దిశ ప్రతినిధి, మేడ్చల్: వరుసగా అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవలనే జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికపై కూడా అవిశ్వాసం తీర్మానం చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో నోటీసు ఇచ్చారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 సెక్షన్ 37 అనుసరించి నో కాన్ఫిడెన్స్ మోషన్ పిటిషన్ చైర్మన్ వ్యతిరేకంగా అందజేశారు.
జీవో ఎంఎస్ 835, జీవో ఎంఎస్ 158 పేర్కొంటూ చైర్మన్ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో విఫలమయ్యారని, సొంత ప్రయోజనాలకే పని చేస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న మొత్తం 23 మంది కౌన్సిలర్ గాను 15 మంది తీర్మానంలో చైర్మన్‌కు వ్యతిరేకంగా సంతకం చేశారు. సంతకం చేసిన వారిలో 1, 3, 5, 6, 7, 8, 10, 11,12, 15, 17, 19, 21, 22, 23 వార్డుల కౌన్సిలర్లు ఉన్నారు.