రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

by Kalyani |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
X

దిశ, దుండిగల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బోధాడి గ్రామానికి చెందిన మాయ, విశాల్(26) భార్యాభర్తలు. బతుకుదెరువు కోసం నాలుగు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి గాగిల్లాపూర్ లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన విశాల్ ఈ నెల 17వ తేదీన సాయంత్రం 7 గంటలకు భార్యతో గొడవపడ్డాడు.

ఈ నెల 19వ తేదీన ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మద్యం మత్తులో విశాల్ చైతన్యకాలనీ ఫిష్ పాంట్ చర్చి గాగిల్లాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న భార్య మధ్యాహ్నం దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story